శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
301. హ్రీంకారీ | ||
హ్రీం అన్నది శక్తి ప్రణవము, శక్తి బీజము. హ్రీంకార భువనేశ్వరి బీజమంత్రమైన సృష్టి, స్థితి, లాయములకు సంకేతము. సాధన చేత, తురియా స్థితికి చేరుకుంటాడు సాధకుడు. ఈ తురీయ స్థితియే హ్రీంకారి. బ్రహ్మవాహమస్మి అని చెప్పి, సహస్రారము దాటిన పిమ్మట శివశక్తికి భేదము లేదు. పరంజ్యోతి మాత్రమే వుంటుంది. ఆమయే హ్రీంకారి. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺సాధన చేత, నిశ్చల మనస్సు చేత, త్రికరణ శుద్ధితో ఏదైనా సాధించచ్చు అన్న నమ్మక్కం కలుగుతుంది 🌺 |