శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
338. వేదజననీ | ||
వేదములకు జనని. ప్రణవ నాదమే వేదజనని. ఓంకారమే శివశక్తులు స్వరూపము,అన్నది వేద ప్రమాణము. వేదములను సృజంచినది పరాశక్తి. గాయత్రీ, సావిత్రి, సరస్వతి రూపమే వేదజనని. సర్వ చైతన్య జీవులకు వారి పుట్టుక నుంచి అంతము వరకు చెయ్యవలసిన కర్తవ్య బోధన, వేదముల వల్ల తేలియును.🙏 🌺 పెద్దల చెప్పిన సూత్రాలను పాటించాలి, అవి మన నిజ జీవితానికి చాలా శ్రేయస్కరమూ. వేదాలు పుట్టింది మన భారత దేశములో, వాటిలో వున్న మర్మమును గ్రహించాలి 🌺 |