శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
359. తాపసారాధ్యా | ||
తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది. తపస్సు అనగా మనలో దాగి వున్న అహంకారము, మదము, సర్వ మాలిన్యములను నశింపచేయటమే. వినయముతో దేవిని ప్రార్ధిస్తే, ఆరాధిస్తే వారిలో కొలువై వుంటుంది 🙏 🌺 నేను, నాది అన్న మమకారము,ఈ పని నేను చేస్తున్నాను అన్న భావన మనలో రాకుండా, అంతా పరాశక్తి యొక్క అనుగ్రహము అన్న ఆలోచనతో వుండాలి. అప్పుడే పరాశక్తికి ప్రీతి పాత్రులమౌతాము 🌺 |