శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
376. శృంగారరస సంపూర్ణా | ||
శ్రీ చక్రాంతర్గతమైన బిందు నవావరణములు శృంగము అనగా పద్మము . శృంగార అనుటచేత దళములు అని అర్ధం . ఈ నవరస దళములు, మనోభావనకు లొంగిన రసములు. ఈ లలితాపరాబట్టారిక శ్రీ చక్ర నవావరణములో, నవ రస సంపూర్ణముగా అనగా, 1) శృంగారాత్మిక ,2) విరరసాత్మిక 3)కరుణరసాత్మిక 4) భయనకరసాత్మిక,5) భీభత్సరసాత్మిక, 6)రౌద్రరసాత్మిక, 7)హాస్యరసాత్మిక,8) అధ్బుత రసాత్మికము, 9) శాంతిరసాత్మికగా కొలువై వుంటుంది. కాబట్టి శృంగారరస సంపూర్ణ అంటే శ్రీచక్ర బిందుస్వరూపిణీ .🙏 🌺జీవితములో తొమ్మిది రసానుభూతిని, తెలుసుకొని, అనుభూతిని పొంది ,సంపూర్ణత్వం పొందగలుగుతాము. 🌺 |