శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
370. మధ్యమా | ||
హిరణ్య గర్భ రూప అనాహత చక్రం హృదయ స్థానంలో, విశుద్ధ చక్రం కంఠ స్థానంలో ఉంటాయి. ఈ అనాహత చక్రంలో ప్రస్తుతం మనస్సు అధీనంలో ఉన్న శబ్ద శక్తిని విశుద్ధ చక్రం చేరే మధ్యలో బుద్ధి అడ్డుకుంటుంది. ఈ స్థాయిని "మధ్యమా" అంటారు. ఇక్కడ రెండు క్రియలు జరుగుతాయి. 1) చెప్పబోయే మాటని బుద్ధి అలోచించి,జల్లెడ పట్టే పని చేస్తుంది. అంటే మనస్సు చెప్పే రకరకాలైన మాటలకి బుద్ధి ఒక స్వరూపం కలిపించి ఆ మాటలు మనం అనవచ్చో లేదో సూచిస్తుంది. ఈ సమయంలో మంచి చెడ్డలు, ఏ భాషలో, ఏ స్థాయిలో అనాలి, ఏ మాట తరువాత ఏ మాట అనాలి వంటి నిర్ణయాలు జరుగుతాయి. 2) భాషా స్వరూపం కూడా ఇక్కడే తయారవుతుంది. అంటే ఒక పూర్తి వాక్య స్వరూపం దాలుస్తుంది. బయటకి వినపడే శబ్దరూపం ఇంకా రాలేదన్న మాట. ఇక్కడే శబ్దం యొక్క అనుసంధానం జరుగుతుంది. ఈ రూపం ఒక విశేష బిందుమయ, హిరణ్య గర్భ రూప అధిదైవతా రూపం ధరిస్తుంది.🙏 🌺ఈ నామము స్మరణ వలన, మనస్సు పడే ఆందోళనకి, బుద్ధి సక్రమ దారి చూపిస్తుంది. 🌺 |