శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
310. రమణీ | ||
రం'అనగా చిదగ్ని, అణి అనగా అణువులు. అణు స్వరూపము తానే కాబట్టి రమణీ అని స్తుతించబడినది. అణువులు అనగా బీజాక్షరాలు. తల్లియొక్క బీజాక్షరాల పవిత్రత తెలుసుకున్న భక్తులు తాద్యాత్మ స్థితిని పొందుతారు. ఆ భావన కలగజేయునట్టి తల్లికి నమస్కారము 🙏 🌺పరుల ఆనందాన్ని తమ ఆనందముగా సంతుష్ట పడుతూ , పరుల కష్టములకు పరిహారము చూపుటములో, ధైర్యము చెప్పటములో కలిగే సంతృప్తి వర్ణనాతీతము.ఈ సంతృప్తి లోనే దాగి వున్నది అమ్మవారి దీవెన.🌺 |