శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
312. రణత్కింకిణి మేఖలా | ||
మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా వడ్డాణము గలది. రణత్ అనగా మ్రాగుచున్న, కింకిణీ మెఖలా అనగా గజ్జలతో కూడిన వడ్డాణము. మణిపురము దగ్గర నాదము వస్తుంది. అక్కడ ప్రారంభమైన నాదము బ్రాహ్మరంద్రము వరకు వెళ్తుంది. కాబట్టి మణిపురము దగ్గర వడ్డాణము ధరించడం అన్నది చెప్పబడినది. వడ్డాణము గల గంటలు సరస్వతి స్వరూపము, నాదబ్రాహ్మస్వరూపము, మంత్రరజ పరమేశ్వరి రూపము . ఈ నాద ధ్వనితో సప్త కోటి మహామంత్రములు ఏర్పడినవి. వాక్కు రూపేణ మనకి అందించడంజరిగింది. నాదస్వరూపిణి అయిన తల్లికి నమస్కారము 🙏 🌺మనము మాట్లాడే ప్రతి ఒక్క మాట, ఆ దేవి మనకి ఇచ్చిన వరము. మాట్లాడే శక్తి మనకి ఇచ్చినది. ఈ వరమును, మంచి, పవిత్రమైన భగవన నామ సంకీర్తన, పురాణ పఠనము, మరియు ధర్మ కార్యాలుపట్ల సుముఖతను తెలుపుటకు వాడాలి.🌺 |