శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
352. వహ్నిమండల వాసినీ | ||
అగ్ని ప్రాకారమునందు వసించునది. వహ్ని అనగా అగ్ని, శ్రీదేవి నిరంతరం అగ్ని కుండంలో ఉంటుంది .ఆమె వెలువడే స్థానమే చిదగ్ని. చంద్ర, సూర్య, అగ్ని మండలములందు తేజో రూపముగా నివసించే తల్లికి నమస్కారము 🙏 🌺మనలో వేడి ఉన్నంతవరకే మనము జీవిస్తాము. శక్తి, తేజస్సు , ఈ గుణములన్నియు అగ్ని వలన మరియు మనము తినే ఆహారాన్ని బట్టి తేజస్సు పెరిగి మేధాశక్తి లభిస్తుంది.🌺 |