శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
362. చితి | ||
చేతనా శక్తి స్వరూపము. ప్రాణ దేవి మహామాయాస్వరూపిణి. కులమార్గమున, తానే బ్రహ్మ అన్న చైతన్య స్వరూపమై, సహస్రారమునకు ప్రయాణించే కుండలిని " చితి: " అని అంటారు. ఈ మార్గము చక్రములన్నింటిని మహాశ్మశానముగా చేయగలిగిన వెలుగు ఏదో అదియే చితి: మహామాయాస్వరూపము బ్రహ్మశీర్షమును చేరి, పరమాత్మ చైతన్యమౌతుంది 🙏 🌺మనస్సు, బుద్ధి, జ్ఞానము కేంద్రికరించగలిగి, ధర్మ మార్గమున నడవగలుగుతాము. 🌺 |