శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
377. జయా | ||
ఎల్లపుడు జయమును ఇచ్చునది. సంఖ్యా శాస్త్రమునందు 'జ' సంఖ్య 8, 'య' సంఖ్య 1. ఈ రెండింటిని కలిపితే 9 అనగా శీ చక్ర నవావరణము. శివశక్తి యొక్క ఆవరణము. తొమ్మిది సంఖ్య శుభ సూచకము. నవావరణము, నవదుర్గలు, నవరాత్రి, నవవీధి భక్తి, నవగ్రహాలు, గర్భము నవమాసము,.. ఇద్యాది జయమును , శుభ సూచకమును కలిగించునవి. జయా అన్న రూపములో వున్న తల్లికి నమస్కారము 🙏 🌺పరాశక్తి యొక్క అనుగ్రహముతో ప్రతి పనిలో జయము సాధించగలము 🌺 |