శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
307. రమ్యా | ||
రమణీయమైనది.అమ్మవారియొక్క నామము, రూపము, సర్వము సర్వరుణంగా , సర్వ కరుణతరంగిణిగా, సర్వ సౌందర్య లహరిగా వుంటుంది. అందుకే ఆ తల్లీ రమ్యా అని పిలవబడుతుంది. రమణియమైన తల్లీ కి నమస్కారము 🙏 🌺 చెడు దృశ్యాలు, చెడు వాతావరణము, దుష్ట భావనకు దూరముగా వుండాలి అని నిర్ణయము తీసుకుంటాము. ఏ రకమైన పరిస్థితి నుంచైనా, వ్యక్తి నుంచైనా వాళ్లలో వుండే జ్ఞానాన్ని, ఆనందాన్ని గ్రహించగలిగే ప్రజ్ఞ మనకి కలుగుతుంది.🌺 |