శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
380. బిందుమాండలవాసినీ | ||
సహస్రారమున నివసించునది. ఆజ్ఞా చక్రమునించి , ముఖ్యప్రాణమైన జయ అన్న నామముతో వున్న సుషుమ్న, తన శక్తి అంతటిని సహస్రారమునకు తీసుకోని వెళ్లి పరాబింధువు స్థానమునకు చేరుస్తుంది. సదాశివ తేజస్సుతో లయమై భ్రహ్మశశీర్షమున బిందురూపేణ సహస్రదళ పద్మలో నివసిస్తుంది శ్రీ రాజరాజేశ్వరీ. 🙏 🌺మనలో ఔన్నత్యానికి, సంస్కారానికి కేంద్ర స్థానము, బిందు రూపేణ మన మస్తీష్కంలో వుంటుంది. దానిని వినియోగించుకోవడం అన్నది మన క్రమశిక్షణ పాటించడం మీద వుంటుంది. 🌺 |