శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
351. వామకేశీ | ||
అందమైన కేశములు కలది వామకులు అనగా ఒక జాతి శివ భక్తులు. వారికి శివుడే ఈశుడు అగుటచే అమ్మ వామకేశి అని పేరు పొందినది వామకేశుని పత్ని వామకేశి. అర్ధనారిశ్వరి తత్వము,ఎడమ బాగము శిరోజములు శ్రీమాతవి .అమ్మ కన్ను వామాక్షి ఆమె వామ హస్త,వామ బాగము స్త్రీలకు శుభము. 🙏 🌺 పక్షి రెక్కల వలె కుడికి ఎడమ , ఎడమకి కుడి ఆధారము .ఎడమ లేని కుడి,కుడి లేని ఎడమ పక్షికి ఉపయోగ పడవు. అటులనే గృహస్థాశ్రమంలో పయనిస్తున్న ప్రతి ఒక్కరూ,అర్ధనారిశ్వర తత్వమును అమలుపరచాలి.🌺 |