శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
391. నిత్యా షోడశికారూపా | ||
పదహారు కళల రూపము నిత్యదేవతలగానున్న పదహారు కళల రూపము జగన్మాత షోడశకళా స్వరూపిణీ. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య. వీటి యొక్క స్వరూపము అయినది నిత్య షోడశి. నిత్యము, సత్యము, అనంతము అయిన పరంజ్యోతియే నిత్య షోడశికారూపా 🙏 🌺పౌర్ణమినాడు,విశేషంగా అమ్మవారి యొక్క నామ స్తోత్ర పారాయణ చేస్తే, షోడశికళస్వరూపిణీ రక్ష మనకి నిత్యము వుంటుంది.🌺 |