శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
323. కదంబకసుమప్రియా | ||
కదంబకుసుమ అనగా కడిమిచెట్టు పూలు ఇష్టము. ఇది సామాన్యముగా వచ్చిన అర్ధము. కదంబము అనగా సమూహము, కుసుమ అనగా పుష్పాలు.పుష్పాల సమూహమును ఇష్టపడుతుంది. కదంబము అనగా సమూహము. రకరకాల పుష్పముల సమూహమును ఇష్టపడుతుంది. ఆ జగజ్జనని వనదుర్గా, ప్రకృతిస్వరూపిణి కాబట్టి ఒక పువ్వు ఇష్టం, ఇంకొక పువ్వు ఇష్టంలేదు అని అనుకోవడము మన అజ్ఞానము. ఇక్కడ ఈ నామము యొక్క విశిష్టతను, నిత్య జీవితములో అమలుపరచడము ఏమీ అనగా, మనము చేసే ప్రతి నిత్య ధర్మాచరణ ప్రక్రియ అంతయూ పుష్పాల సమూహముగా భావించి, ఆ జగజ్జననియైన లోక మాతకు సమర్పిస్తే, ఆ తల్లీ ప్రీతిచెందుతుంది అని ఈ నామము యొక్క అంతరార్ధం.🙏 🌺 మన ప్రతి అడుగు, ఆలోచనా, అన్నియూ ఆ తల్లియొక్క అనుగ్రహము లేనిదే మనము ఏమీ చేయ్యలేము అన్న అనుభవము కలుగుతుంది. "సర్వం శ్రీ కృష్ణర్పణమాస్తూ" అని తల్లీ పాదాల చెంత పుష్పాల సమూహాన్ని సమర్పించుకుంటాము 🌺 |