శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
348. వంద్యా | ||
నమస్కరింప తగినది, వందనీయమైనది. మనసా, వాచా, కర్మణా త్రికర్ణ శుద్ధితో ఆ పరశక్తికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తే, విజయము, విమల వంటి స్వభావములు లభిస్తాయి. విజయ విమలత్వాలకు మూలం వినమ్రత అని గ్రహించాలి . వినమ్రతతో వందనం చేస్తే దేవీ దేవతలు సంతృప్తి పడతారు .వందనీయమైన తల్లికి నమస్కారము 🙏 🌺మాలిన్యము లేని జీవితము జీవిస్తే , అందరు మనకి వందనములు సమర్పిస్తారు.🌺 |