శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
368. పశ్యంతీ | ||
వాక్కు యొక్క రూపము బిందురూపేణ మూలాధారంలో ఉన్న ఆ శబ్దబ్రహ్మ వాగ్రూపంగా, వాయువుగా పైకి బయలుదేరుతుంది. ఈ స్థితిలో ఉన్న శక్తి పేరు "పరా". ఊర్ధ్వ ముఖంగా బయలుదేరిన ఈ శక్తి నాభి వద్దనున్న స్వాధిష్టాన చక్రం దగ్గిరకి వచ్చేటప్పటికి ప్రభంజనమై, "పశ్యంతీ" రూపం పొందుతుంది. ఆ శక్తి పరా రూపం నించి పశ్యంతీ రూపం ధరించేటప్పుడు అక్కడ మనస్సు కేంద్రీకృతమై (అంటే మనసుతో కలిసి) చూస్తూ ఉంటుంది. అందుకే ఆ శక్తికి 'పశ్యంతీ' అని పేరొచ్చింది. అంటే ఈ స్థితిలో శబ్ద శక్తి మనస్సు అధీనంలో ఉంటుంది. మనస్సు యొక్క స్వభావం ఏంటంటే అది ఎప్పుడూ మనకి వివిధ వికల్పాలని చూపిస్తూ ఉంటుంది. అంటే Options ఇస్తూ ఉంటుంది. ఈ వాగ్రూపములో వున్న తల్లికి నమస్కారము 🙏 🌺ఈ నామము పట్టించడం వల్ల మాట్లాడాలి, వ్యక్తం చెయ్యాలి అనే చైతన్యము మనలో కలుగుతుంది. 🌺 |