శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
367. ప్రత్యక్చితీరూపా | ||
ప్రత్యగాత్మ స్వరూపము తనను గురించి తనకు తెలిసే జ్ఞానం యొక్క స్వరూపమే.ఆత్మజ్ఞాన స్వరూపము. అంతరముఖముగా చైతన్య స్వరూపము కలిగివున్నది. నాద జ్ఞాన స్వరూపిణీయైన తల్లికి నమస్కారము 🙏 🌺ఆత్మ జ్ఞాన విచారణ జరుగుతుంది. ప్రత్యక్చితీగా మన శరీరములో వుండి, మన వాక్క సంకల్పాన్ని సిద్ధింపచేస్తుంది. 🌺 |