శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
373. కామేశ్వర ప్రాణనాడీ | ||
శివుని ప్రాణనాడీ స్వరూపిణి. నాడిస్వరూపిణీ. సమస్త నాడి సముదాయముల యందు చైతన్య స్వరూపిణిగా తిరిగే పరాశక్తి కామేశ్వర ప్రాణనాడి. ఏ పని చెయ్యాలన్న మన శ్వాసప్రక్రియ , నాడిసముదాయము రెండు చాలా ముఖ్యమైనవి. కామేశ్వర అనగా శివుడు, ప్రాణ నాడి అనగా పరమేశ్వరి. జీవుడు దేహము ప్రాణముతో వున్నపుడు శ్వాస రూపేణ శివునిగా, ప్రాణనాడి రూపిణి గా పరమేశ్వరి నివసిస్తారు. ప్రాణనాడిగా నివసించి వున్న తల్లికి నమస్కారము 🙏 శ్వాస, నాడిసముదాయము పనిచేయ్యనిచో, శివుడు,.. శవమౌతాడు. 🌺శక్తి కోసము, దేహా ఆరోగ్యం కొసం, సాధన చెయ్యవలసిన నామము 🌺 |