శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
342. క్షేత్రేశీ | ||
క్షేత్రమునకు అధికారిణి శరీరమే క్షేత్రము కాబట్టి, మనలోనే నివాసము వుంటూ, క్షేత్ర స్వరూపిణీ గా మనకి దారి చూపిస్తుంది. శరీరములో ప్రతి అంగములో,శ్రీ దేవి అనంత లావణ్యం వ్యాపించి విరాజిల్లుతుంది .శరీర రూపం లో మన కర్మాను సారం దేవియొక్క తేజం లభిస్తుంది . క్షేత్రమును శివశక్తి స్వరూపముగా భావించుకుంటే, లలితా పరమేశ్వరియే క్షేత్రేశీ.ఆ తల్లికి నమస్కారము 🙏 🌺 మనలోని పవిత్ర భావన వల్ల జగజ్జనని మన శరీరములో నివాసం వుంటుంది.🌺 |