శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
399. వ్యక్తావ్యక్త స్వరూపిణి | ||
వ్యక్త, అవ్యక్తము రెండు తానే అయి వుంది. వ్యక్తమంటే కనిపించేది. ఆ వ్యక్తమంతా ఉమాస్వరూపం. కనిపించనిదంతా – అవ్యక్తం, శివస్వరూపము. ‘వ్యక్తావ్యక్త స్వరూపిణియే' శివశక్తి స్వరూపిణీ. ఈశ్వరునియొక్క సంకల్పానికి శక్తి ఇవ్వవలసిన, మరియు సంకల్పానికి పూర్ణత్వం కలిపించవలసిన భాద్యత ఆమెదే కనుక వ్యక్తావ్యక్త స్వరూపిణియైన తల్లికి నమస్కారము 🙏 🌺మనలో వుండే చైతన్యము ఏదో ఒక రూపములో కనిపిస్తుంది, ఒక్కొకప్పుడు కనిపించకుండా అనుభవంములోకి మాత్రమే వస్తుంది. ఈ రెండు తత్వాలు అనుక్షణము మనకి బలాన్నిచ్చి, ఏది నిజము, ఏది కాదో అని నిర్ణయించుకోగల ఆలోచనాశక్తిని కలిగిస్తాయి. 🌺 |