శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
379. ఓడ్యాణపీఠ నిలయా | ||
ఆజ్ఞాచక్రమే ఓడ్యాణపీఠము. ఓడ్యానము అంటే సర్వ వ్యాప్తియైన నాదకాంతి. ఉదానవాయువుగా సర్వ వ్యాప్తిగా తన వెలుగు పెంచుతూ, తన గమ్య స్థానమైన సహస్రారమునకు చేరుకుని, చితకళా స్వరూపిణిగా ద్విదళ పద్మముగా ఓడ్యాణపీఠములో నివసిస్తుంది 🙏. నేనే బ్రహ్మని అన్న జ్ఞానం కలిగిస్తుంది. 🌺విజయము సంపాదించాక వచ్చే ప్రవర్తన, "నేను కాబట్టి చేయ్యగలిగాను అన్న అహంకారాన్ని విడిచి, సమతుల్యము చేస్తూ, నాలో వుండే పరాశక్తి అండ వున్నది కాబ్బటి చేయ్యగలిగాను అన్న మార్పు వస్తుంది.🌺 |