శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
364. చెదేక రసరూపిణీ | ||
ఆనంద రస రూపిణి. చిత్ = జ్ఞాన చైతన్యమే ; ఏకరస = ఒకే ఒక్క రసంగా, సర్వసారముగా ; రూపిణి = స్వరూపము కలది. జ్ఞానచైతన్యములో కలిగే ఆనంద రసమే అమ్మవారి స్వరూపము. ప్రతి జీవిలోను అమ్మవారి రూప, తత్వ సారాన్ని దర్శించేది కూడా ఈ ఒక ‘చిత్’ రసానుభూతి. అందుకని అమ్మవారు "చిదేకరసరూపిణి" 🙏 🌺విశ్వం లోని అన్నిటిలోను 'అమ్మవారి ' చైతన్యము నిండి వుంది అని గ్రహించగలము. 🌺 |