శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
397. మూలప్రకృతిః | ||
పంచభూతాత్మకమైన ప్రకృతికి మూలము. సృష్టిలో పంచభూతములకు మూలము ప్రకృతి. ప్రకృతి స్వరూపమే పరాశక్తి. సృష్టి, స్థితి,లయకు కారణమైనదే పరాశక్తి. ఆమెయే మూల ప్రకృతి. ప్రకృతిలో జరిగే అన్ని ప్రళయములకు ఆమెయే సాక్షి. అన్నింటికీ మూలకారణమైన తల్లికి నమస్కారము 🙏 🌺మూలప్రకృతి అంతటా నిండి వున్నది అనే నియంత్రణతో, మన ప్రతి అడుగు ధర్మ మార్గము వైపు వుంటుంది. 🌺 |