శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
349. వందారు జనవత్సలా | ||
నమస్కరించు భక్తులకు వాత్సల్యము చుపిస్తుంది. రెండు చేతులు చేసే నమస్కారం ,మనసు చేసే ‘’మననం’’ కు బీజమవుతుంది .విశ్వ వంద్య ఐన దేవికి నమకరిస్తే ఆమె కృప, వాత్సల్యం పుష్కలంగా లభించి అనుగ్రహం కలుగుతుందని అని ఈ నామము యొక్క భావం .వత్సల్య స్వరూపమైన తల్లికి నమస్కారము 🙏. 🌺మనము ఇతరులకు చూపించే ప్రేమ, వత్సల్యము,మూలంగా మనకి పరాశక్తి యొక్క వాత్సల్యము లభిస్తుంది 🌺 |