శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
381. రహోయాగక్రమారాధ్యా | ||
ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది. బింధువు బ్రహ్మాషర్షము చేరినప్పుడు, విరాట పురుష దర్శనము జరుగుతుంది. దీనిని నిజమైన యాగము అందురు. ఈ స్థితిలో నామముతో పని లేదు , మంత్రముతో పని లేదు,బీజముతో పని లేదు , రూపముతో పనిలేదు. కేవలం రెండు వెలుగుల ఏకీకృత లక్షణమే రహో యాగము. బ్రహ్మాశీర్ష మార్గములో వెలుగునీ ఆరాదించటమే క్రమారాధ్యా. జీవిడు నిశ్చలతత్త్వముతో, ఏకాగ్రతతో ధ్యాన వెలుగును ఆరాధించు తల్లీయే రహోయాగక్రమారాధ్య 🙏 🌺 బ్రహ్మా జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం మొదలవుతుంది. |