రక్ష కల్పించే తల్లీ రక్షాకరీ.
సృష్టి, స్థితి,లయ, తిరోధానము, వమనము లకు అధిష్టాత్రి, పంచబ్రహ్మ స్వరూపిణీయైన లలితాపరమేశ్వరియే రక్షాకరీ.
కాలస్వరూపిణి కాబ్బటి, ప్రతి మనిషి తను చేసుకున్న ప్రారబదాన్ని బట్టి వారి పూటుక, జీవన విధానము, మరణము ఏర్పడుతుంది.
ఎన్ని ప్రారబధాలు వున్నప్పటికీ భక్తితో మంత్ర స్మరణ మాత్రం చేత, వారికి రక్ష కలిగిస్తుంది ఆ పరాశక్తి.
భయాన్ని తొలగిస్తుంది. అభయాన్ని ఇస్తుంది.
సర్వ ఆపదలనుండి మానవులకు రక్షణ కలిగించే మంత్రము రక్షాకరీ.
సకల జగత్తును రక్షించు తల్లికి నమస్కారము 🙏
🌺మనిషి జీవితములో సుఖము, దుఃఖము రెండు అనుభవానికి వస్తాయి. సుఖము వచ్చి నప్పుడు తనని తాను మరిచిపోయి ప్రవర్తించడము గర్వము కలగడము, దుఃఖములో భయము, అజాగ్రత్త, అవివేకం, వంటి లక్షణాలు రావడం సహజం. ఆ లక్షణాలు మన దరికి రాకుండా,పరాశక్తి యొక్క పాదపద్మములను మరింత శ్రధతో పూజించాలి అన్న జ్ఞానము కలుగుతుంది.🌺
|