శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
336. వింధ్యాచల నివాసినీ | ||
వింధ్య పర్వతము యందు నివాసము గలది, అన్నది సామాన్య అర్ధము,.. మరియొక్క విశేషమైన అంతరార్ధము,.. అచలము అనగా కదలకుండా ఒక చోట వుండటం అని కాదు. అంతటా, సర్వవ్యాపి అని అర్ధము. వి౦దతి అనే క్రియకు పొందుతాడు అంటే ధారణ శక్తి అని ,లక్ష్య సిద్ధి కలుగుతుంది అనే గొప్ప నమ్మకం కలిగిస్తుంది . కనుక వింధ్యాచలం అనగా ,ధారణకు కేంద్రం ,పరమార్ధ సాధనకు ఉపకరించే ధ్యాన పీఠమే పరమేశ్వరి నివాసం . మనిషికి ధ్యానం వల్లనే జ్ఞానం లభిస్తుంది అనిఅర్ధం .ఈ జ్ఞానమే పరమేశ్వరిని గుర్తింప జేస్తుంది అని భావం 🙏. 🌺మనస్సులో వున్న భావాలు, వాటి రూపకల్పన వల్ల మనకి సమాజములో వింధ్య పర్వతం అంతా ఏతైనా ఉన్నత స్థానము లభిస్తుంది.🌺 |