శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
385. సాక్షివర్జితా | ||
సాక్షి లేనిది. సృష్టి, స్థితి, లయ అన్ని వేళలా విశ్వానికంతకూ అమ్మవారే సాక్షి, అన్నపుడు అటువంటి అమ్మవారికి మరల ఇంకొక సాక్షి ఎవరుంటారు? అందుకనే, వర్జింపబడిన అంటే - లేకుండా చేయబడిన సాక్షి గలది అంటే 'తనకు సాక్షిగా వేరే ఎవరూ లేనిది' అని ఈ నామము యొక్క అర్థం.🙏 🌺సాక్షి అయిన ఆ జగన్మాత ని పశ్చాత్తాపం తో వేడుకుంటే మళ్ళీ ఎలాంటి పొరపాటు జరగకుండా కాపాడుతుంది. సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. 🌺 |