శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
315. రతిరుపా | ||
రతము, నిరతము అంటే, ఒక పనియేందు నిమగ్నమై వుండగలగడమే రతి. పని యొక్క రూపమే రతి.అఖిలాండకోటి బ్రహ్మండజనని పనియొక్క రూపమే రతి రుపా. తనయందు తాను నిమగ్నమై, బ్రహ్మమే తాను అన్న అంతర విశ్వాసముతో ధ్యాన మార్గమున సహస్రారములోకి వెళ్లిన తరువాత , శివ శక్తి కాంతి ఏకమైన రూపము రతిరుపా. లలితాంబయే రతిరుపా. లయకారిణి, నిర్వాణ కారిణి.ఆ తల్లికి నమస్కారము 🙏 🌺తను చేపట్టిన పని మొదలు నుండి చివరివరకు నిమగ్నమై వుండి, తనకి కావలిసిన ఫలితము వచ్చే వరకు, ద్రుష్టి మరలచ్చకుండా వుండే స్వభావము కలుగుతుంది.🌺 |