శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
337. విధాత్రీ | ||
బ్రహ్మ స్వరూపిణీ. జగతరూపకల్పనకు విధానము ఏర్పరచిన తల్లీ విధాత్రీ ఈ సృష్టి నడవడానికి ఒక విధానము వున్నది. సూర్యోదయం, చంద్రదయం అన్నది ఒక విధానము, ఒక పద్దతి. సమస్త చరాచర జగత్తుకు పోషణ కలిగించుట, భారమువహించుట అన్నదే విధాత్రీ 🙏 🌺కార్యం పట్ల సమర్ధత వహించే శక్తి సామర్ధ్యాలు లభిస్తాయి.🌺 |