శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
361. తమోపహా | ||
చీకటిని పొగ్గొటునది. తమస్సు -అనగా చీకటి,అజ్ఞానము ఆపహా -పోగొట్టునది. ఏది మంచి, ఏది చెడు అని కూడా తెలుసుకోలేని వారికి, తమోపహా అన్న శక్తి రూపములో, వారికి మార్గం చూపిస్తుంది. అజ్ఞానాన్ని పోగొట్టి బ్రాహ్మజ్ఞానాన్ని చేకూరుస్తుంది.🙏 🌺పరాశక్తి యొక్క పాదాల చెంత సమస్తము సమర్పించినప్పుడు,భయము లేక మమకారము అన్న బలహీనతలు ద్వారా కలిగే అజ్ఞానపు చీకటిని తొలగించుకునే మార్గాలు, వెలుగు రూపేణ గొచరిస్తాయి.🌺 |