శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
371. వైఖరరీరూపా | ||
స్పష్టముగా వ్యక్తమైన వాక్కు. విశుద్ధ చక్రంలో, ఈ శబ్దబ్రహ్మమైన శక్తి ,ఇతరులకి వినపడే శబ్ద పద, వాక్య రూపాలు దాలుస్తుంది. దీన్ని "వైఖర " అంటారు. ఈ వైఖరి స్వరూపం ఒకొక్క మాటని ఒకదాని తరువాత ఒకటి ఎలా ఉచ్చరించాలో అలా కంఠంలో ఉన్న కండరాలని కదిలించడం ద్వారా శబ్దోత్పన్నం చేసి వినేవాళ్ళకి అర్ధమయ్యే రూపంలో బయటకి పంపుతుంది. ఇదివరలో పూర్తి అర్ధవంతంగా తయారయిన శబ్దబ్రహ్మం ఇక్కడ ఒక వరుసక్రమంలో బయటకి వస్తూ ఒకొక్క కండరాన్ని కదిలిస్తూ 'శబ్ద ' రూపంగా బయటకి వస్తుంది. ఏ వైఖరితో బయటకి రావాలో నిర్ణయిస్తుంది కనక దీని రూపం 'వైఖరీ '. 🌺మనము మాట్లాడే మాట,ఎవ్వరిని నొప్పించకుండా వుండేటట్టు జాగ్రత్త పడుతాము. 🌺 |