శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
386. షడంగ దేవతాయుక్తా | ||
ఆరు అంగదేవతలతో కూడి వున్నది. ప్రతి యొక్క మంత్ర సాంకేతమైన దేవతలకు అంగదేవతలు అంటే హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము. ఖడ్గమాలలో సర్వజ్ఞ అన్న పేరు కలిగినది హృదయదేవి, నిత్యతృప్తా అన్నది శిరోదేవి, అనాదిబోధ అన్నది శిఖాదేవి, స్వతంత్రతా అన్నది కవచదేవి,అలుప్త అన్నది నేత్రదేవి, అనంత అన్నది అస్త్రదేవి. వీరు శ్రీచక్రమునందు షడంగదేవతలు. వీరు అమ్మవారియొక్క అంగరక్షకులు. వారితో కూడి వున్నది కాబట్టి ఆమె షడంగదేవతాయుక్తా 🙏 🌺మన ప్రతి అంగములో శక్తి ప్రసరిస్తున్నప్పుడే ఏదైన సాధించగలము. ఈ నామము ద్వారా శారీరక బలమును పొందగలుగుతాము 🌺 |