శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
353. భక్తిమత్కల్పలతికా | ||
భక్తుల పట్ల కల్పవృక్ష తీగ వంటిది తన యందు భక్తి కలవారికి ఒక కల్పలత లాగా అన్ని కోరికలనూ తీరుస్తుందని అర్థం. లతలు క్రమక్రమంగా ఎలా విస్తరిస్తాయో అదే విధంగా భక్తులకు పరాశక్తి తన అనుగ్రహాన్ని క్రమంగా విస్తరిస్తూ, అందిస్తూ వారిని వారి గమ్యం ఐన మోక్షం వైపు నడిపిస్తుంది అన్న భావన ఈ నామము ద్వారా చెప్పుకోవచ్చును.🙏 🌺లక్ష్యం అనే వృక్షానికి, మన మనస్సు, ప్రయత్నం, దీక్ష తీగ వలే అల్లుకుపోవాలి. అప్పుడే దృఢత్వం ఏర్పడి లక్ష్యాన్ని సాధించగలము.🌺 |