శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
304. హేయోపాదేయవర్జితా | ||
కావలసిన, కాదన్నవి ఏమియూ వుండవు. ధర్మముతో ముడి బడి వున్న ఆలోచనలతో నిండివున్నది. ఆచరింపతగినవాటిచే, నిషేదించిన వాటిచే విడువబడినట్టిది. హెయము అనగా వర్జనీయమైన వస్తువు, ఉపాదేయము అనగా స్వీకరింపబడిన వస్తువు. ఈ రెండింటికీ అతీతము అయిన తల్లికి నమస్కారము 🙏 🌺ఒకరికి మంచి, మరొకరికి చెడు చేద్దాము అన్న ఆలోచనలు కలగవు. చేస్తే అందరికి మంచి చేద్దాము, మంచినే మాట్లాడుదాము అన సత్బుధి కలిగి వుంటాము.🌺 *305. రాజరాజార్చితా* రాజ రాజులచే ఆర్చించబడినది. రారాజులు అనగా కుబేర, మనువుచే పూజింపబడునది. శివశక్తి స్వరూపిణీ అయిన రాజ రాజేశ్వరినీ ఆర్చించుట. నిష్కమముగా, సంకల్పరహితముగా శ్రీవిద్యను ఆర్చించేవారికి , కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺దేవీ ని అర్చిస్తే ధర్మ పాలనకు సహాయ పడగలుగుతాము, ఆరాధించగలుగుతాను.🌺 |