శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
344. క్షయవృద్ధి వినిర్ముక్తా | ||
క్షయ, వృద్ధి కి అతీతమైనది. క్షయము అంటే అంతరించుకుపోవడం, నాశనము. వృద్ధి అనగా పెరుగుదల. వాటికి అతీతమైనది. జీవుడు తమ కర్మల వలన ఉన్నత స్థితిని(వృద్ధిని), అధోగతిని (క్షయను)పొందుతాడు. ఈ రెండు స్థితుల పరిణామమునకు లొంగని అతీత లక్షణము కలిగిన పరాశక్తి కి నమస్కారము 🙏 🌺మానవుడు జీవితములో గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్నత స్థానానికి ఎదగడం, మరల గ్రహాల స్థానము మారినప్పుడు పేరు, ధనము, ఉన్నత స్థానము నష్టపోవటము జరుగుతాయి. అవి తాత్కాలికమే అన్న మనోధైర్యముతో,పరాశక్తి మీద అచంచలమైన విశ్వాసముతో, జీవన ప్రయాణము సాగించాలి.🌺 |