శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
357. తాపత్రయాగ్ని సంతప్త* *సమాహ్లాదన చంద్రికా* | ||
అధిభౌతిక, అధిదైవిక ఆధ్యాత్మిక తాపములు,అగ్నిచేత తపింప చేయబడిన వారులకు మిక్కిలి సంతోషమును కలుగజేయు వెన్నెల వంటిది. ఆదిభౌతిక - ఇతర మనుష్యుల వలనగాని, జంతువుల వలనగాని కలిగే బాధలు. ఆదిదైవిక - దైవికంగా సంభవించే వరదలు, భూకంపాలు మొదలైన వాటి వలన కలిగే బాధలు. ఆధ్యాత్మిక - మనస్సు లో కలిగే - భయాలు, సంకోచాలు, మానసిక రోగాలు, దుస్స్వప్నాలు. జగన్మాతను హృదయంలో నింపుకున్న భక్తులకు, ఈ మూడు తాపాల నుండి ఆహ్లాదకరమైన చల్లదనాన్ని ఇచ్చి స్వస్థత చేకూరుస్తుంది.🙏 🌺తాపములను తొలగించి , ఆరోగ్య పరంగా , మానసికంగా కలిగే అనేక సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది.🌺 |