శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
309. రంజనీ | ||
రంజింప జేయునది.భక్తి శ్రద్దలతో తనని ఆశ్రయించిన భక్తులను ఆనందపరుచుతుంది. తనకి ఏ రంగు లేకపోయినా, తన దరిజెరిన వస్తువు యొక్క రంగును తనదిగా స్పటికమెలా ప్రతిఫలిస్తుందో, అలాగే, నిర్వికార, నిర్గునాత్మకమైన పరాశక్తి భక్తుల గుణాధిక్యతను ప్రతిబింబిస్తుంది. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺పరాశక్తి యొక్క ద్రుష్టి మన మీద రంజింపచేసేలాగా, ధర్మ మార్గమున నడవాలి అన్న దృఢత్వము ఏర్పడుతుంది 🌺 |