శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
363. తత్పదలక్ష్యార్ధా | ||
పరబ్రహ్మను చేరుకొనుట. ప్రతి ఆత్మ యొక్క లక్ష్యము పరబ్రహ్మముయందు లీనమగుటా. తత్పద = 'తత్' మూలకారణమైన పర బ్రహ్మ'. లక్ష్య + అర్థ = లక్ష్యార్థా = లక్ష్యము పరబ్రహ్మ స్వరూపమైన అమ్మవారిని చేరుకొనుట. భక్తుల యొక్క తత్పదమును చేర్చుట కొరకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటుంది.🙏 🌺 మన ప్రయత్నం లో ఆటంకాలు తొలగించి అన్ని విధాలా సమకూర్చి గమ్యం చేరుస్తుంది. సంకల్పము మంచిది అయితే ఆచరణ చెడకుండా ఆ తల్లి దీవిస్తుంది. ఈ నామ మంత్రం నిత్యం జపించే వారికి నిత్య జీవితంలో లోటు ఉండదు, ఉపాధి లేని వారికి ఎదో ఒక పని దొరుకుతుంది. 🌺 |