శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
331. వరదా | ||
వరములను ప్రసాదించేది. శక్తిని ప్రసాదించే తల్లీ అని కూడా అర్ధం. మానవులకు శక్తియే వరము. శక్తి లేకున్నచో, జీవన సరళి సరిగ్గా సాగదు. శక్తినే వరముగా ప్రసాదించే తల్లికి నమస్కారము 🙏 🌺తల్లిని కోరుకొన్నవి ధర్మ బద్దంగా వున్నప్పుడు, కోరుకున్నవి తప్పకుండా ఫలిస్తాయి. శక్తినే వరముగా ఇవ్వమని కొరోకోవాలి. శక్తి వున్నప్పుడే మనకి గౌరవము, మర్యాదా అన్ని లభిస్తాయి. 🌺 |