శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
383. సద్య: ప్రసాదినీ | ||
తక్షణమే సిద్ధిని ప్రసాదించునది జీవుడు నిశ్చలతత్త్వముతో, ధ్యాన వెలుగును ఆరాధించు రహోయాగస్థితి మరియు రహస్తర్పణ స్థితి యందు వున్నవారికి తక్షణమే సిద్ధిని ప్రసాదిస్తుంది🙏 🌺ఒకరి మెప్పు కోసము కాకుండా, చేసే పనిలో స్వచ్ఛతను, క్రమపద్దతిని పాటిస్తే తక్షణమే ఫలితము లభిస్తుంది. 🌺 |