శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ | ||
సర్వాంతర్యామిని, సర్వతత్వ స్వరూపిణీ గాయత్రీ స్వరూపము. "గాయత్రం త్రయతి ఇతి గాయత్రీ" గాయం అంటే శరీరము, గాయమనే శరీరమును కాపాడునది అని అర్ధం. శరీరం క్షేత్రం అయితే ,శరీరరహస్యం తెలుసుకున్నవాడు "క్షేత్రజ్ఞుడు’’ అంటారు . క్షేత్రానికీ , క్షేత్రజ్ఞడు కీ తమతమ బాధ్యతలు నిర్వహించే శక్తి, క్షేత్రేశ్వరి వలన లభిస్తుంది. అందుకే ఆమెను ‘’క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని ‘’అన్నారు 🙏 🌺 జీవుడు తనలో వుండే పరమాత్మను తెలుసుకోడానికి ప్రయత్నం మొదలుపెడతాడు 🌺 |