శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
365. స్వాత్మానందలవీభూత* *బ్రహ్మానంద సంతతి | ||
బ్రహ్మాండములో వుండే ఆనందము అమ్మవారి ఆనందం లో లేశమాత్రమే ! స్వ + ఆత్మ +ఆనంద = స్వాత్మానంద = తనకు సంబంధించిన ఆనందం తో, లవీభూత = లేశ మాత్రమైన ; బ్రహ్మా + ఆది + ఆనంద సంతతిః = బ్రహ్మానందం విశ్వసృష్టికి మూలకారమైన ఆనందం అమ్మవారిది. అంటే, అమ్మవారి ఈ ఆనందం లోంచే విజ్ఞానము సర్వ ప్రాణులకు అందిస్తుంది. ఇలాంటి బ్రహ్మానందం, వందైనా అమ్మవారి ఆనందం లో లేశ మాత్రమే! అంటే - అమ్మవారి ఆనందం సముద్రం లాంటిది 🙏 🌺సంకల్ప స్థాయి నించి ఫలితము స్థాయి వరకు అన్నింటిలో ఆనందాన్ని అనుభవించగలుగుతాము. గెలుపు, ఓటమి రెండింటినించి నేర్చుకోవలసింది చాలా వున్నది అన్న జ్ఞానము కలుగుతుంది. 🌺 |