శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
346. విజయా | ||
విజయాన్ని ప్రసాదిస్తుంది. పరాజయము లేనిదే విజయా. లోపల, బయటి శత్రువులలతో పోరాడి విజయం పొందాలి .గెలిచినవారి జీవితమే సార్ధకం. ఆధ్యాత్మిక జీవితం లో లోపలి శత్రువులను అణచటం ముఖ్యమైన విషయం .కామ క్రోధాది వికారాలను జయించే దాకా మనశ్శాంతి ఉండదు. తనపై తాను విజయం సాధించి ,తనను తాను తెలుసు కోవటమే విజయా. అన్ని వేళలా విజయాన్ని సాధించే తల్లికి నమస్కారము 🙏 🌺బాహ్య ప్రపంచాన్ని గెలవడం కన్నా, మనలో వుండే సంస్కారము, క్రమశిక్షణా అన్నవి అహర్నిశలు పాటించడమే విజయా.🌺 |