శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
378. జాలంధర స్థితా | ||
జాలంధర పీఠముపై కూర్చున్నది. జీవుడి హృదయ స్థానము నందు, ద్వాదశ దళములతో, కాంతి రూపిణియై జాలంధరపీఠమున , విష్ణు ముఖి అను పేరుతో ఆసీనురాలై వుంటుంది. జాలంధర పీఠము,అమ్మవారి యొక్క మహామాయా స్వరూపము.🙏 🌺విజయ స్థానాన్ని చేరుకుంటాము, అనగా మనని మనం గెలవడం. బాహ్యంగా గెలవడం కంటే అంతరంగంగా గెలవడం ముఖ్యం. 🌺 |