శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
306. రాజ్ఞీ | ||
బీజమంత్ర రూపము. 'ఈ' కారమున్న అక్షరము ఒక్కటే ఆ తల్లియొక్క పరా రూప. అక్షర పరంజ్యోతి. రాజరాజేశ్వరునియొక్క పట్టమహీషి. బీజాక్షరీ లో దాగివునా పరాశక్తికి నమస్కారము 🙏 🌺బీజాక్షరీ అక్షరములు, అతి పవిత్రమైనవి. లలితా సహస్ర నామములో వుండే ప్రతి నామము అతి పవిత్రమైనవి. వాటిని నిత్యము శ్రద్దా, భక్తితో పట్టించడం వల్ల, రక్షణ కవచము వలే మనల్ని ఆపదనుండి కాపాడుతుంది.🌺 |