శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
341. క్షేత్రస్వరూపా | ||
క్షేత్రము అనగా దేహము. మన దేహములో వున్న శక్తి స్వరూపిణీ. సమస్త చరాచర జగత్తులో,అన్ని రూపాలల్లో (శరీరములో ) తానే అయి వున్న తల్లికి నమస్కారము 🙏 🌺మన దేహమే ఈశ్వరశక్తి రూపము. అలాగే ఎదుటి వారి దేహము కూడా ఈశ్వరశక్తి రూపమే అన్న జ్ఞానము తో, ఒకరినొకరు గౌరవించుకునే స్వభావము కలుగుతుంది.🌺 |