శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
327. కళావతీ | ||
కళ అంటే 'శ్రీ'. లక్ష్మి స్వరూపము. చతుషష్టి అనగా అరువై నాలుగు కళలు కలిగివున్నది. వాక్క రూపుముగా సరస్వతి స్వరూపిణీ, సర్వసంపదలను, ఐశ్వర్యములు ఇచ్చే లక్ష్మి స్వరూపిణీ, సృష్టిని లయము చేయటానికి మహాకాళ స్వరూపిణీగా వుంటుంది. అన్ని కళలు తానే అన్న రూపాత్మిక జగత్తులో గాయత్రీ స్వరూపముగా భావించవచ్చు. లలిత కళలే కళావతీ గా లలితాపరమేశ్వరి.🙏 🌺చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నృత్యము, కవిత్వము వంటి లలిత కళలను అభ్యాసము చెయ్యగలుగుతాము. ప్రతి మనిషిలోనూ అంతర లీనంగా దాగి వున్న కళలను కళావతీ అన్న పరాశక్తి అనుగ్రహముతో సాధన చెయ్యగలుగుతాము.🌺 |