శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
321. కామ్యా | ||
కోరికలను తీర్చునదీ. కామ్యా అనగా కొరదగినవన్నియూ ఇచ్చునది. కామ్యా అంటే కోరికలు. మానవులు సకామంగా పూజ చేసేవారు, ధర్మార్ధకామములనే కోరుతారు. కోరికలను తీర్చేవారు వుంటే, కోరికలకు ఆరంభం మరియు అంతము వుండదు . కోరికల వర్షం కురుస్తూనే వుంటుంది.... కోరికలు తీర్చడానికి ముందు, కొంత దానం, ధర్మము,త్యాగము, పుణ్యకార్యములను చేసి వుండాలి. వీటిన్నిటికంటే ముందు శ్రద్ధ, భక్తి తో చేసిన పూజకి, ఆ దేవి కోరికలను తప్పకుండా తిరుస్తుంది. కోరికలన్నియు సాధారణంగా ప్రతి మానవుడు అడిగేవే. సకామపూజ కంటే నిష్కామపూజా గొప్పది. నిష్కామపూజా కోరిక అంటే బ్రహ్మాతత్వప్రాప్తి, మోక్షము. దీనికొరకు అమ్మవారిని ప్రార్దించే వారు, పరాశక్తికి చాలా ప్రీతి. " లోకా సమస్తా సుఖినో భవంతు " అన్న సంకల్పమే చాలా గొప్పది. లోకమంత సుభిక్షంగా వుండాలి అని కోరుకోవాలి 🙏 🌺ధర్మపరమైన సంకల్పములు కలుగుతాయి 🌺 |